Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ.. గదిలోకి తొంగి చూసింది.. అంతే..?

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ జరుగుతుందని చూసేందుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారయత్నానికి గురైంది. తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుల బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:40 IST)
అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ జరుగుతుందని చూసేందుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారయత్నానికి గురైంది. తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుల బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే...  రాత్రి 10 గంటల సమయంలో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న యువతి, విధులు ముగించుకుని, ఇంటికి వచ్చి మెట్ల మార్గం ద్వారా రెండో అంతస్తుకు వెళుతున్న వేళ, మొదటి అంతస్తులో కొందరు యువకులు మందు కొట్టి గొడవ చేస్తుండటాన్ని గమనించింది. వారిపై ఫిర్యాదు చేయాలని భావించి, గదిలో ఎవరు ఉన్నారో చూద్దామని నెమ్మదిగా తొంగి చూసింది. దీంతో ఆమె చేతిలోని లంచ్ బాక్స్ కిందపడింది. 
 
ఈ శబ్దాన్ని విన్న గది లోపలి యువకులు, ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారితో పెనుగులాడి, అరుస్తూ, తప్పించుకుంది. చివరికి ఆ యువతి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
గదిలో ఇంకా చాలామంది ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చేయడంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments