Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ముగ్గురు మహిళలపై అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి..?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:52 IST)
హర్యానాలోని పానిపట్‌లో నలుగురు సభ్యుల ముఠా అకస్మాత్తుగా ఆయుధాలు, కత్తులు, పదునైన బ్లేడ్లతో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోకి ప్రవేశించిన ముఠా మహిళలు తప్ప మిగతా కుటుంబ సభ్యుల చేతులు కట్టేసి.. శబ్దం చేస్తే చంపేస్తామని బెదిరించారు. 
 
దీంతో భయాందోళనకు గురైన వారు శబ్దం చేయలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగలు, డబ్బు దోచుకెళ్లిన ముఠా పారిపోయింది. 
 
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మరోచోట కూడా దోపిడీ జరిగింది. భార్యాభర్తలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముఠా.. భర్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. ఆరోగ్యం బాగాలేని భార్య భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో యువతిపై గుంపు దాడి చేసింది. 
 
గాయపడిన మహిళ మృతి చెందింది. అలాగే కిడ్నాప్‌కు గురైన భర్త నుంచి డబ్బు, మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనల్లోనూ ఒకే ముఠా హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరగడంతో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments