Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో శృంగారానికి అడ్డుగా ఉందనీ... ప్రసాదంలో విషం కలిపిన ప్రియురాలు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (09:24 IST)
బెంగుళూరు నగరంలోని చింతామణి పట్టణంలోని నారసింహపేట గంగమ్మ దేవాలయంలో విష ప్రసాదం ఆరగించి ఇద్దరు మహిళలు చనిపోయారు. ఈ కేసులోని మిస్టరీని బెంగుళూరు నగర పోలీసులు ఛేదించారు. తాను శారీరకసుఖం పొందేందుకు ప్రియుడు భార్య అడ్డుగా ఉందన్న అక్కసుతో ఓ మహిళ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. ప్రియుడు భార్యను హత్య చేసేందుకు ప్రియుడుతో పాటు ప్రియురాలు, మరో మహిళ కలిసి ప్రసాదంలో విషం కలిపినట్టు తేల్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గంగమ్మ ఆలయంలో అందజేసిన ప్రసాదం గౌరి, కవిత అనే ఇద్దరు మహిళలు చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గౌరి అనే మహిళ భర్త లోకేశ్‌తో లక్ష్మీ అనే మహిళకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన గౌరి... వారిని నిలదీస్తూ వచ్చింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించిన లక్ష్మీ... తన ప్రియుడు లోకేశ్‌తో కలిసి గౌరిని హత్య చేసేలా ప్లాన్ వేసింది. ఇందుకోసం గంగమ్మ ఆలయం వద్ద పూలు అమ్ముకునే మహిళ సాయం తీసుకుంది. 
 
ఈ ముగ్గురు కలిసి ఆలయ ప్రసాదంలో బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే ప్రమాదకరమైన రసాయనాలను కలిపారు. దీంతో ఆలయం వద్ద పంపిణీ చేసిన కేసరిబాత్ ప్రసాదం ఆరగించడంతో గౌరితో పాటు కవిత అనే మహిళ చనిపోగా, మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో లక్ష్మీతోపాటు మరో మహిళను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న లోకేశ్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments