Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిలిండర్ డెలివరీ బాయ్‌తో రాసలీలలు.. అడ్డొస్తున్నాడనీ భర్తను కుమార్తెతో కలిసి చంపేసిన భార్య

Webdunia
బుధవారం, 27 మే 2015 (13:07 IST)
తమ అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడన్న కసితో కుమార్తె, కుమార్తె ప్రియుడు, తన ప్రియుడుతో కలిసి ఓ కసాయి మహిళ దారుణానికి పాల్పడింది. కట్టుకున్నోడిని కడతేర్చి.. రైలుపట్టాలపై పడేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లాలో చోటు చేసుకుంది. హతుని తల్లి ఫిర్యాదుతో అసలు నిందితులు ఎవరనే విషయం తేటతెల్లమైంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
పుదుక్కోట్టై జిల్లాలో నమనసముద్రం అనే ప్రాంతంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణా కొట్టుపెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య వసంతి, కుమార్తె అన్బుకరసిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి గత ఫిబ్రవరి 25వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మృతదేహం ఆయన ఇంటి వెనుకనే ఉన్న రైలు పట్టాలపై పడివుంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మృతుని తల్లి సింగమ్మాళ్ తిరుచ్చి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఒక ఫిర్యాదు చేసింది. తన కోడలు వసంతికి సిలిండర్ డెలివరీ బాయ్‌తోనూ, అన్బుకరసికి కూడా మరో యువకుడితో అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి వారిద్దరిని గట్టిగా మందలించారనీ, దీన్ని జీర్ణించుకోలేని వారు.. తన కుమారుడిని వారిద్దరు కలిసి హత్య చేసివుంటారని సింగమ్మాళ్ తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వసంతి, అన్బుకరసిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. ఈ విచారణలో అసలు విషయం తెలిశారు. తమతో పాటు సిలిండర్ డెలివరీ బాయ్, మరో వ్యక్తితో కలిసి హత్య చేసి, మృతదేహాన్ని పట్టాలపై పడేసినట్టు చెప్పారు. దీంతో వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో సిలిండర్ డెలివరీ బాయ్ వీరచోళన్ కోర్టులో లొంగిపోగా, ఈ హత్య కేసులో సంబంధం ఉన్న అన్బుకరసి ప్రియుడు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments