Webdunia - Bharat's app for daily news and videos

Install App

20మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారా? పన్నీర్‌కు సపోర్ట్‌గా ఓటేస్తారా? ఓపీఎస్ వేషం వేస్తున్నారా?

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంతో తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తాయని తేలనుంది. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్నాడీఎంకే అ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:19 IST)
తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంతో తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తాయని తేలనుంది. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, శశికళ క్యాంపులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్టు సమాచారం. 
 
అయితే ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం మాత్రం తన అధికారాన్ని పూర్తిగా వినియోగించి శశికళకు చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తాము పన్నీర్‌ సెల్వానికి మద్దతునిస్తామని, తమను విడిచిపెట్టాలని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇందుకు అనుమతించని శశి వర్గం బలవంతంగా వారిని బంధించి రిసార్ట్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. వందలమంది శశికళ మనుషులు ఎమ్మెల్యేలు జారిపోకుండా కాపలా కాస్తున్నారని తెలిసింది.
 
ఈ నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలను శశికళ విడిచిపెడతారా? ఆ 20మంది పన్నీర్‌కు మద్దతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విడిగొట్టి.. ఎవరికి తెలియకుండా వివిధ రిసార్టులకు, బీచ్‌లకు తరలించిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. జయలలితకు అందించిన చికిత్సలు, మరణం వెనుక సందేహాలకు సంబంధించిన అన్ని విషయాల్లోను శశికళ గ్రూపుకు సహాయకుడిగా ఉన్న పన్నీర్‌ సెల్వం విడిపోయిన తరువాత ఉత్తముడిగా వేషం వేసుకుని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని పీఎంకే నేత రాందాస్‌ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జయ మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటుచేస్తానని ప్రకటించి 24 గంటలు గడిచినా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆయనలో అంకితభావం ఉంటే ఇంతకుముందే ఈ పని చేసుండాలని రాందాస్‌ వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments