Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవును చంపితే 14 యేళ్ళు.. మనిషిని చంపితే రెండేళ్లు : న్యాయ వ్యవస్థలో లోపాలు

దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను పలువురు న్యాయకోవిదులు ఎత్తిచూపుతున్నారు. ఎందుకంటే.. గోవును చంపితే 14 ఏళ్ల జైలు.. మనిషిని చంపితే మాత్రం రెండేళ్లు జైలుశిక్ష విధించడాన్ని ఓ కోర్టు శిక్ష విధించడాన్ని పలువురు

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (10:41 IST)
దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను పలువురు న్యాయకోవిదులు ఎత్తిచూపుతున్నారు. ఎందుకంటే.. గోవును చంపితే 14 ఏళ్ల జైలు.. మనిషిని చంపితే మాత్రం రెండేళ్లు జైలుశిక్ష విధించడాన్ని ఓ కోర్టు శిక్ష విధించడాన్ని పలువురు న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 
 
సెప్టెంబరు 11, 2008లో బీబీఏ విద్యార్థి అయిన భాసిన్ దక్షిణ ఢిల్లీలో బీఎండబ్ల్యూ కారులో వెళ్తూ అనూజ్ చౌహాన్, అతడి స్నేహితుడు మృగాంక్ శ్రీవాస్తవను ఢీకొట్టాడు. ఈ ఘటనలో చౌహాన్ చనిపోగా శ్రీవాస్తవ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. చండీగఢ్ పారిపోతున్న భాసిన్‌ను ఐఎస్‌బీటీ కశ్మీరీ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు 30 ఏళ్ల ఉత్సవ్ భాసిన్‌ను దోషిగా తేల్చి, ముద్దాయికి రెండేళ్ల శిక్ష విధించడంతోపాటు మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు, క్షతగాత్రుడికి రూ.2 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో మేలోనే కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్షాకాలాన్ని మాత్రం శనివారం ప్రకటించింది. ఈ కేసులో ముద్దాయికి కనీసం 10 యేళ్ళ జైలుశిక్ష పడుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, కోర్టు మాత్రం రెండేళ్లు మాత్రమే విధించింది. ఈ కేసులో జడ్జి ఇచ్చిన ఈ తీర్పు న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గోవును చంపిన నేరానికి వివిధ రాష్ట్రాల్లో కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. అదేసమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న వారికి మాత్రం నామమాత్రపు శిక్షలు విధించి వదిలేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments