Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ ఏడ్చిందని ఆ తండ్రి దగ్గుమందు పోశాడా.. ఫూటుగా తాగి కొట్టి చంపేశాడా?

ముక్కుపచ్చలారని చిన్న పాప గుక్కపెట్టి ఏడుస్తోంది. బిడ్డ ఏడవడం చూడలేని తండ్రి పాపకు దగ్గుమందు తాగించాడు. ఆ మందే పాప పాలిట శాపమైంది. మందు డోస్‌ ఎక్కువవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ముం

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (16:45 IST)
ముక్కుపచ్చలారని చిన్న పాప గుక్కపెట్టి ఏడుస్తోంది. బిడ్డ ఏడవడం చూడలేని తండ్రి పాపకు దగ్గుమందు తాగించాడు. ఆ మందే పాప పాలిట శాపమైంది. మందు డోస్‌ ఎక్కువవడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ముంబై షిర్డినగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే... వికాస్ (తండ్రి)  ఆదివారం మధ్యాహ్నం పాప రోధిస్తుండడంతో టానిక్ పట్టించాడు. అది తాగిన పాప వెంటనే నిద్రపోయింది. 
 
పడుకున్నపాప ఎంత సేపటికి లేవకపోవడంకో వికాస్ కేకలు పెట్టాడు. కేకలు విన్న స్థానికులు... పరుగు పరుగున వచ్చి పాపను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఇక్కడ మరో ఘోరమైన విషయం ఏంటంటే పాపకు మందు పట్టించేటప్పుడు వికాస్ కూడా ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నాడు. ఇక ఇరుగుపొరుగు వారు వికాసే పాపను కొట్టి చంపేశాడని అంటున్నారు. 
 
వికాస్ ఎప్పుడూ తాగొచ్చి పిల్లల్ని కొడుతుండేవాడని...ఆ క్రమంలోనే ఆదివారం కూడా పిల్లలను అలాగే కొట్టాడని చుట్టుపక్కలవారు చెప్తున్నారు. ఈ ఘోరం జరిగినప్పుడు వికాస్ భార్య ఇంట్లో లేదని చెబుతున్నారు. వికాస్ నిరుద్యోగి కావడంతో బరువుతెరువు కోసం ఇతని భార్య ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంది. పని ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కన్నబిడ్డ కన్నుమూయడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది.
 
ఇరుగుపొరుగువారు సమాచారం మేరకు.. వికాస్‌పై అనుమానంతో పాపను పరిశీలించిన పోలీసులు పాప శరీరంలో ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో గాయాలున్నట్లు తేలితే వికాస్‌పై హత్యకేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments