Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుల వర్షం - 16 మంది మృతి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (08:51 IST)
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ పిడుగులపాటుకు ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే  పిడుగుపాటుతో 16 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివవరకు కురిసిన పిడుగుల వర్షానికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం ఈస్ట్ చంపారాన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్ జిల్లాలో ముగ్గురు, వెస్ట్ చంపారాన్ జిల్లాలో ఇద్దరు, అరారియ జిల్లాలో ఇద్దరు బంకా ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, ఈ పిడుగల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments