ఢిల్లీలో వేడిగాలులు-14 మంది మృతి.. యూపీలో కానిస్టేబుల్ ప్రాణం పోతున్నా..?

సెల్వి
గురువారం, 20 జూన్ 2024 (16:30 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వేడిగాలుల కారణంగా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా 118 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో గత కొన్ని రోజుల్లో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఇది గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
గత కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది గత 60 ఏళ్లలో అత్యధికం. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉత్తర భారతదేశంలో వేడిగాలులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. 310 మంది ప్రభుత్వాసుపత్రుల్లో చేరారు. 112 మంది డిశ్చార్జ్ అయ్యారు. 118 మంది ఇప్పటికీ అడ్మిట్‌లో ఉన్నారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.. అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
 
అయితే ఎండ దెబ్బకి కానిస్టేబుల్ ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తోటి ఉద్యోగులు వుండిపోయారు. యూపీలో ఓ కానిస్టేబుల్ ఎండ వేడికి వడ దెబ్బ కొట్టి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. తోటి ఉద్యోగులు సాయం చేయకుండా చోద్యం చూస్తూ మొబైల్లో వీడియో తీశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారు. అతని ప్రాణం పోయేంతవరకు అలానే వీడియో చూస్తుండిపోయారే కానీ.. ఆయన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments