Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి 13 యేళ్ళ బాలుడిని హత్య చేసిన 17 యేళ్ళ బాలుడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (16:15 IST)
కిడ్నాప్, హత్యకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న బాల నేరస్థుడు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడని భావించి ముందస్తుగా విడుదల చేస్తే... తన ప్రియురాలితో కలిసి మరో 13 యేళ్ళ బాలుడిని హత్య చేసిన ఘటన దక్షిణ ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణ ఢిల్లీకి చెందిన 17 యేళ్ల బాలుడికి టీవీ షోలంటే మహా పిచ్చి. ఈ షోలలో పాల్గొనాలని తెగ ఆరాటపడేవాడు. ఇందుకోసం అవసరమైన డబ్బుల కోసం దోపిడీలు దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ రోజున వృద్ధురాలిని హత్యచేశాడు. ఆ తర్వాత బాలనేరస్థుల కారాగారంలో ఉంచగా, ఎంతో సత్‌ప్రవర్తనతో మెలిగాడు. దీంతో జైలు అధికారులు చూసి.. అతన్ని ముందుగానే విడుదల చేశారు. 
 
జైలు నుంచి విడుదలైన తర్వాత కొద్ది రోజులు సక్రమంగానే ఉన్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి 13 ఏళ్ల వయసుగల బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఆ బాలుడి తండ్రిని రూ.60 వేలు డిమాండ్ చేశాడు. కానీ ఆయన ఆ సొమ్ము చెల్లించలేకపోవడంతో కిడ్నాప్ చేసిన బాలుడిని ఉత్తరాఖండ్‌ తీసుకెళ్లి, చంపేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments