Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవమి పండగ పూట విషాదం - మెట్ల బావిలోపడి 13 మంది మృతి

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (18:53 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి జరిగింది. స్థానికంగా ఓ మెట్ల బావి పైకప్పు కూలిపోవడంతో అందులో భక్తులు పడిపోయారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటన ఈ ఘటన పటేల్‌ నగర్‌ ప్రాంతంలో జరిగింది. 
 
స్థానిక మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు. వీరిలో 13 మంది చనిపోయారు.
 
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు 10 మందిని కాపాడి వారిని ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో రాములవారి కల్యాణోత్సవం నిర్వహించారు. 
 
విద్యుదాఘాతం కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments