Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీకి చిక్కిన నల్ల తిమింగలం.. రూ.120కోట్లు, 430 కేజీల బంగారం వెలికితీత

నోట్ల రద్దుతో నల్లధనాన్ని కొత్త నోట్లుగా మార్చేసిన నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవలే భారీ మొత్తంతో పట్టుబడిన నేపథ్యంలో తాజాగా ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (13:40 IST)
నోట్ల రద్దుతో నల్లధనాన్ని కొత్త నోట్లుగా మార్చేసిన నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవలే భారీ మొత్తంతో పట్టుబడిన నేపథ్యంలో తాజాగా ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతోంది.

తాజాగా ఢిల్లీ నోయిడా శ్రీ లాల్ మహల్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ లక్నో విభాగం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా భారీ నగదు బయటపడింది. ఏకంగా ఐటీ దాడుల్లో రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలను అధికారులు వెలికితీశారు.

ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్దతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తానికి లెక్క చెప్పలేకపోవడంతో ఐటీ అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ  కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments