Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేసిన ఆధార్.. రేషన్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని సోమవారం జరుపుకోవడం జరిగింది. అదేరోజున ఓ ఆకలి చావు కూడా నమోదైంది. ఆకలికేకలు తట్టుకోలేక ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్‌లో సంభవించింది. ఇక్కడ విచిత్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (13:56 IST)
అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని సోమవారం జరుపుకోవడం జరిగింది. అదేరోజున ఓ ఆకలి చావు కూడా నమోదైంది. ఆకలికేకలు తట్టుకోలేక ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్‌లో సంభవించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ ఆకలిచావుకు ఆధార్ కారణం కావడం గమనార్హం. 
 
రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేయకపోవడంతో రేషన్ ఇవ్వలేదు. అలా 15 రోజులుగా పస్తులు ఉంటూ వచ్చిన ఆ చిన్నారి చివరకు సోమవారం ప్రాణాలు విడిచింది. ఒకవైపు సంక్షేమ పథకాలకు ఆధార్‌ నెంబరు అనుసంధానం తప్పనిసరికాదని సుప్రీం కోర్టు చెబుతుంటే.. మరోవైపు ప్రభుత్వం ఆధార్‌తో అనుసంధానించని వారిని సంక్షేమ పథకాలకు దూరం చేయడమే కాదు, వారి చావుకు కూడా కారణమవుతోంది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిమ్దేగా జిల్లా కరిమతి అనే గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం తన రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకోలేపోయింది. దీంతో ఆ కుటుంబానికి రేషన్ బియ్యం ఇచ్చేందుకు రేషన్‌ డీలరు నిరాకరించాడు. ఫలితంగా పక్షం రోజులుగా తినడానికి తిండి లేక ఆ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తూ వచ్చారు. ఈ కుటుంబంలో 11 యేళ్ల సంతోషి కుమారికి పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజనమే దిక్కైంది. పాఠశాలకు సెలవు ఉంటే అదీ అందని దుస్థితి. ఇటీవల వారం రోజులుగా భోజనానికి నోచుకోని సంతోషి ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments