Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై చెంబూరులో విషాదం : కొండ చరియలు విరిగిపడి 11 మంది మృతి

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (09:14 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 11 మంది ప్రాణాలు మృత్యువాతపడ్డారు. 
 
భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు స్థానిక భరత్‌నగర్ ప్రాంతంలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్న 11 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు శిథిలాల నుంచి 16 మందిని రక్షించాయి. 
 
శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 5 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరో 8 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
కాగా, ముంబైలోని విక్రోలీ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments