Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ళ నాటి మర్రి చెట్టుకు విషమిచ్చి చంపారు... ఎందుకో తెలుసా?

సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (13:56 IST)
సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇక్కడ భారీ వృక్షం అడ్డు తొలగించుకునేందుకు విషమిచ్చి చంపినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వందేళ్ళ వయసు గల ఓ మర్రి చెట్టు ఓ ఐటీ పార్కుకు ఎదురుగా ఉంది. దీన్ని అడ్డు తొలగించాలంటే నగర పాలక సంస్థ అనుమతి కావాలి. దీంతో ఈ మర్రి చెట్టు అడ్డును ఎలా తొలగించాలన్న అంశంపై ఐటీ కంపెనీ యాజమాన్యమే చెట్టుపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. 
 
దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments