Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండుగా విడిపోయిన లోహిత్ ఎక్స్‌ప్రెస్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (08:32 IST)
ఇటీవలికాలంలో వరుస రైలు ప్రమాద ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజాప్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, గూడ్సు రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. తాజాగా లోహిత్ ఎక్స్‌ప్రెస్ రెండుగా విడిపోయింది. 
 
కటిహార్‌ జిల్లాలో గౌహతి నుంచి జమ్మూకు వెళ్లే లోహిత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిను నుంచి సుమారు 10 బోగీలు విడిపోగా.. మిగిలిన రైలు మాత్రం కొంతదూరం అలాగే పరుగులు తీసింది. బిహార్‌ - బెంగాల్‌ సరిహద్దులోని నార్త్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలో ఉన్న దల్ఖోలా స్టేషను సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చాలామంది ప్రయాణికులు ప్రాణభయంతో కిందికి దూకేశారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేసి, రెండు భాగాలను జత చేశాక రైలు మళ్లీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments