Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి వారు ఇండియాలో అడుగుపెట్టడమా.. నెవర్ అంటున్న కేంద్ర మంత్రి

చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించేవారు ఇకమీద బారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి భారతీయ వీసా ఫార్మాట్‌నే సవరించవలసిన అవసరం ఉందని కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ పేర్కొన్నారు.

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (04:57 IST)
చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించేవారు ఇకమీద బారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి భారతీయ వీసా ఫార్మాట్‌నే సవరించవలసిన అవసరం ఉందని కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి వారిని దేశంలోకి అడుగు పెట్టనీయకుండా చేయడానికి మన వీసా ఫార్మాట్‌లోనే మార్పు చేయాలని ఆమె విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. 
 
బాలబాలికలను వేధించినట్లుగా నేర  రికార్డు కలిగిన విదేశీ జాతీయులు భారత్‌లో అడుగుపెట్టలేని విధంగా మన వీసా ఫార్మాట్‌ను మార్చవలసిన అవసరముంది సుష్మాజీ, ఇంతవరకు విదేశీయులు తమపై జరిగిన నేర విచారణ రికార్డును ప్రకటించవలసిన అవసరం లేదు. కానీ ఇకనుంచి మాత్రం విదేశీయుల క్రిమినల్ రికార్డును పొందుపరుస్తూ ఒక డిక్లరేషన్‌ని భారత వీసా ఫార్మాట్లో పొందుపర్చాలి అంటూ మనేకా ట్వీట్ చేశారు.
 
చిన్నిపిల్లలను లైంగికంగా వేధిస్తున్న వీడియోలను డౌన్ లోడ్ చేసి వాటిని విస్తృతంగా అప్‌లోడ్ చేస్తున్న ఒక అమెరికన్ పౌరుడిని హైదారాబాద్‌లో అరెస్టు చేసిన వార్త వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర శిశుమహిళాభివృద్ధి శాఖ మంత్రి మనేకా స్పందించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం