Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా మిస్సింగ్... మళ్లీ ప్రత్యక్షం... కిడ్నాపా? వెళ్లిందా...?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (11:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తి సర్నా బుధవారం నాడు అదృశ్యమైంది. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆటోలో వెళుతూ తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంది. ఐతే అకస్మాత్తుగా ఆమె పెద్దగా కేకలు వేసింది. ఆమె అలా అరుస్తున్నప్పుడు కొందరు చూశారు కూడా. ఐతే ఆ ఆటో ఆ తర్వాత కనిపించకుండా పోయింది. 
 
ఆ ప్రాంతంలో సీసీ కెమేరాలు కూడా పనిచేయకపోవడమూ, ఆమె ఫోన్ సిమ్ కార్డు కూడా ఆ ప్రాంతంలో పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ఏదైనా అఘాయిత్యం జరిగిందేమోనని హడలిపోయారు. దీంతో పోలీసులు జల్లెడపట్టడం మొదలుపెట్టారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సైతం ఆమె జాడను కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. దాంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అన్ని ప్రాంతాలను గాలిస్తున్న క్రమంలో ఆమె స్వయంగా తను ఢిల్లీలో ఉన్నాననీ, రైలు ఎక్కి వస్తున్నట్లు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
 
ఐతే ఇప్పుడు సస్పెన్స్ ఏమిటంటే... ఆమె అక్కడకు ఎందుకు వెళ్లినట్లు... ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లారా... లేదంటే ఆమె అక్కడకు వెళ్లిందా... అసలు ఏం జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు. తన తల్లి మాత్రం తన బిడ్డ క్షేమంగా ఉంది. ఆమె ఇంటికి వచ్చాక ఏం జరిగిందో అడుగుతాం, ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్లాడో కనుగొంటామని ఆమె చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments