Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ వారసత్వ జంతువుగా గజరాజు: పర్యావరణ శాఖ

Webdunia
జాతీయ వారసత్వ జంతువుగా గజరాజును ఎంపిక చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం ప్రకటన చేసింది. అలాగే, అంతరించి పోతున్న ఏనుగుల మందను రక్షించేందుకు కూడా కొన్ని సూచనలు, సలహాలను జారీ చేసింది. అంతరించి పోతున్న గజరాజుల పరిరక్షణకు కేంద్రం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యులతో కూడిన కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఈనెల 13వ తేదీన జరిగిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.

ఈ అంశంపై కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని తరాలుగా వస్తున్న మన సంస్కృతిలో గజరాజులు ఒక భాగమన్నారు. అందువల్ల పులులను సంరక్షించినట్టుగానే వీటిని కూడా రక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

అంతేకాకుండా, నేషనల్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన 12 మంది సభ్యుల కమిటీ కూడా ఏనుగుల రక్షణ, గుర్తింపుపై ఒక నివేదిక సమర్పించింది. ఇదిలావుండగా, ఆసియా ఖండంలో ఉన్న గజరాజుల్లో 60 శాతం ఏనుగులు భారత్‌‍లో ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే 25000 ఏనుగులు ఉండగా, వీటిలో 3500 ఏనుగులు బంధీలుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

Show comments