Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఫ్యాషన్ శైలిని మెరుగుపరుచుకోండి

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2007 (12:31 IST)
ఫ్యాషన్‌గా కనిపించాలంటే కేవలం ఫ్యాషన్ వస్త్రాలు ధరిస్తే సరిపోదు. వస్త్రాలతో పాటు మీరు కూడా ఫ్యాషన్‌గా కనపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పట్టణాలలోను, నగరాలలలోనూ నివసించే మహిళలు ఫ్యాషన్‌గా కనిపించడానికి కొన్ని చిట్కాలను పాటించవలసి ఉంటుంది. పదుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపేందుకు ఊతమిచ్చే ఫ్యాషన్ చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము.

మీరు లావుగా ఉన్నట్లయితే, స్లీవ్‌లెస్ కట్‌లకు గుడ్‌బై చెప్పండి. తేలికపాటి షేడ్స్‌ను వదిలి గాఢమైన రంగులతో కూడిన వస్త్రాలను అలా కాకుండా తేలికపాటి షేడ్స్‌ను మాత్రమే ధరించాలని మీరు కోరుకున్నట్లయితే, స్కై బ్లూ జోలికి పోకుండా డల్‌గా కనిపించే డల్ బ్లూ లేదా డర్టీ బ్లూను ఎంచుకోండి.

చిన్న ప్రింట్లు, నిలువు ప్రింట్లుతో కూడిన వస్త్రాలను ధరించి మీరు నాజూకుగా ఉన్నారన్న భావనను ఇతరులలో కలిగించండి. కాటన్ మరియు కోటా చీరెలను దూరంగా ఉంచండి. షిఫాన్ మరియు జార్జెట్ చీరెలు మీకు చక్కగా సరిపోతాయి.

మీరు మధ్యస్థులుగా ఉన్నట్లయితే, మీరు బీజ్ మరియు ఫాన్ రంగులను ఎంచుకోవాలి. ఈ రంగులతో రూపొందిన జార్జెట్ లేదా సాటిన్ చీరెలు మీకు మరింత అందాన్ని తీసుకువస్తాయి. ఇక బ్లౌజుల విషయానికి వచ్చినట్లయితే, నెట్‌లకు ప్రాధాన్యతనివ్వండి. ఎందుకుంటే శారీరక లోపాలను కప్పిపుచ్చడంలో నెట్‌లకు సాటి మరేదీ రాదు.

మీరు సన్నగా ఉన్నట్లయితే, అన్ని రంగులు మీకు ఇట్టే నప్పుతాయి. అందమైన షేడ్‌లన్నీ మీకు అమర్చినట్లుగా సరిపోతాయి. స్లీవ్‌లెస్, డీప్ కట్‌లు మరియు స్ట్రాప్‌డ్ బ్లౌజులను సైతం మీరు ధరించవచ్చు.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. పదేళ్ల గడువు ఒక్క రోజులో..?

పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి.. కౌంటింగ్ రౌండ్లు ఎన్ని?

పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు?

లండన్ నుంచి గన్నవరంకు సీఎం జగన్.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష

Andhra Pradesh Lok Sabha Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

Show comments