Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (17:42 IST)
File
FILE
మహిళలు వేసుకునే మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల తరబడి మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.

ఇంకా చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు ఎండబెట్టిన 50 గ్రాముల క్యారెట్ తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది.

అలాగే రోజులో కనీసం నాలుగైదుసార్లు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే జిడ్డు సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇక మీలాంటి సమస్య ఉన్నవాళ్లు జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే కొంత మార్పు ఉంటుంది.

బాదంపప్పు, గ్లిజరిన్ సుగుణాలున్న సబ్బుల్ని వాడాలి. వారానికి రెండుసార్లు బత్తాయి, దోస, కీరదోస వంటి వాటితో ముఖాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల చర్మంలోని నూనెశాతం అదుపులోకి వచ్చేస్తుంది. ఇక, పెదవులు పొడిబారి ఉంటే మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌లను ఎంచుకోవాలి. కొందరి పెదవులు సహజంగా ఉంటాయి. అలాంటి వారు డ్రైలిప్‌స్టిక్స్ వేసుకుంటే సరిపోతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments