Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార మకరంద సుమాలతో సౌందర్యం..!

Webdunia
FILE
సుగంధ రాజా లిల్లీ: ముఖం మీద మెటిమలుంటే దీని పువ్వులను.. పసుపు, వెన్నతో కలిపి మెత్తగా నూరి ముఖానికి రాస్తే మొటిమల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

దాసాని (మందార) పుష్పం: తలవెంట్రుకలు పెరగడానికి, నల్లబడేందుకు దీని పువ్వుల రసం కొబ్బరినూనెతో సమపాళ్లలో కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. పేనుకొరికిన చోట దీని పువ్వులను నలిపి రోజుకు రెండు, మూడుసార్లు రుద్దితే తిరిగి వెంట్రుకలు వస్తాయి.

ఆముదం: ఆముదం, నూనె తలకు నిత్యం వాడితే వెంట్రుకలు దృఢంగా, నల్లగా పెరుగుతాయి.

శ్రీగంధం: శ్రీగంధపు నూనెను, ఆవనూనెను కలిపి ముఖంపై రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. శ్రీగంధం మంచి సువాసన కలిగి ఉంటుంది.

పలాష-(మోదుగ): ముఖం మీద మొటిమలతో బాధపడేవారు దీని ఆకులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటి ఆకులు గాయాలను మాన్పేందుకు బాగా పనిచేస్తాయి.

కస్తూరి పసుపు: దీనిని నీటితో గంధంగా నూరిగాని మెత్తని చూర్ణాన్ని నీటిలో కలిపిగాని, ముఖానికి లేపనం వేస్తే నల్లమచ్చలు, వలయాలు పోయి ముఖ వర్చస్సు పెరుగుతుంది.

గుంటగలగర: దీని రసంతో తయారుచేసిన తైలం తలకు రాసు కుంటే జుట్టు సమస్యలు, చుండ్రు మొదలగు సమస్యలు తగ్గుతాయి.

ఉమ్మెత్త: దీని రసం జుట్టుకు మర్దించుట వలన పేనుకొరుకుడు తగ్గుతుంది. ముఖం మీది మచ్చలు నలుపుతనం పోయేందుకు పసుపును జిల్లేడు పాలతో నూరి పలుచగా పూయాలి.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments