Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెగ్నెంట్‌గా ఉన్నారా..? అయితే దంత సంరక్షణపై శ్రద్ధ తీసుకోండి!

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2013 (16:19 IST)
FILE
ప్రెగ్నెంట్‌గా ఉన్నారా..? అయితే దంత సంరక్షణపై శ్రద్ధ తీసుకోండి అంటున్నారు గైనకాలజిస్టులు. గర్భధారణ సమయం దంత కావిటీస్, చిగురువాపు, చెడు శ్వాస నుండి దూరంగా ఉండాలంటే.. పంటిని రెగ్యులర్‌గా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

సమతుల్య ఆహారం తీసుకోవటం మర్చిపోకూడదు. ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయాలి. ఆహారం తీసుకున్న తర్వాత మీ నోటిని ప్రతిసారీ శుభ్రం చేయాలి. తద్వారా ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టవచ్చు. గర్భధారణ సమయంలో సాఫ్ట్‌గా ఉండే పేస్టులను వాడటం మంచిది.

ఇక మీ నాలుక క్లీనింగ్ అనేది దంత పరిశుభ్రత మాదిరిగానే ప్రాముఖ్యతను కలిగి ఉంది.మీ నోటి శుభ్రం సమయంలో మీ నాలుకను కూడా శుభ్రం చేయాలి. మీరు మీ నాలుకను శుభ్రం చేయడానికి మీ టూత్ బ్రష్‌ను లేదా టంగ్ క్లీనర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

గర్భధారణ సమయంలో మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో ఎక్కువ స్వీట్ తీసుకోకండి. అధికంగా స్వీట్స్ తీసుకోవడం ద్వారా మీ పళ్ళు పాడు చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.

సమతుల్యమైన ఆహారం తినడం అనేది గర్భధారణ సమయంలో నోటి రక్షణ కోసం చాలా ముఖ్యం. పాలు, చీజ్, కాటేజ్ చీజ్ లేదా తియ్యని పెరుగు వంటి పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. కానీ కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా ఉండటం చాలా మంచిదని గైనకాలజిస్టులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments