Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వజ్రపు అక్షరాల్ని దొరుకుతున్నప్పుడే ఏరుకోవాలి.. లేదంటే....

Webdunia
గురువారం, 21 జూన్ 2012 (15:57 IST)
WD
పూర్వం ముగ్గురు యువకులు గుర్రాలపై వెళ్తుండగా ఆకాశవాణి ఇలా పలికింది. "ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్లండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీకు ఓ మహాద్భుతం కాచుకుని ఉంటుంది. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు" అంది

ఆకాశవాణి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్లకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్లు తప్ప మరేమీ కన్పించలేదు. అయినా ఆకాశవాణి చెప్పింది కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్లి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు.

మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఆకాశవాణి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు. ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ల ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్లను మూటగట్టక రాలేదెందుకబ్బా అని.

చదువు కూడా అంతే... చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే, ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments