Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గేట్ వే ఆఫ్ ఇండియా" కథా, కమామీషు..!!

Webdunia
FILE
" గేట్ వే ఆఫ్ ఇండియా" ముంబయి నగరంలోని అపోలోబందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే.

భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. 1911వ సంవత్సరం డిసెంబర్‌లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-5, క్వీన్ మేరీలు భారత పర్యటనకు గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1924 డిసెంబర్‌లో కట్టడాన్ని పూర్తి చేశారు.

బ్రిటీష్ సైన్యం భారత్ నుంచి వెనుదిరిగినప్పుడు అందులోని సోమర్‌సెట్ లైట్ ఇన్‌ఫ్రాంటీ మొదటి దళం గేట్ వే ఆఫ్ ఇండియా నుంచే బయలుదేరి వెళ్లింది. ఇదిలా ఉంటే.. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచే ముంబయిలోకి చొరబడిన ఉగ్రవాదులు గత సంవత్సరం నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు ముంబాయి వెళ్ళిన యాత్రికులకు గేట్ వే ఆఫ్ ఇండియా చారిత్రక కట్టడంగా అందరికీ ఆప్తమయ్యింది. అయితే ఇప్పుడు దీనికంటే ఎక్కువగా ఉగ్రవాదుల దాడికి గురైన తాజ్ హోటల్, నారిమన్ హౌస్‌లు ప్రాముఖ్యం పొందాయని చెప్పవచ్చు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకుల్ని అప్పట్లో ఉగ్రవాద దాడులు జరిగిన ప్రాంతాలకు టూరిస్టులు వారికి తెలిసిన విషయాలను చెబుతున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments