Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిప్రాయం వీడకపోతేనేం.. అతడో ఉగ్రవాది...!

Webdunia
ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి పాక్‌ గిరిజన ప్రాంతాల్లోని కొండలను, గుట్టలను దాటుకుంటూ ఆప్ఘాన్‌లో ప్రవేశించాడు. జాకెట్ ధరించిన ఈ అబ్బాయి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు పట్టుకున్నారు. ఇంతకూ ఆ అబ్బాయి జాకెట్లో ఏముందోనని విప్పిచూసిన పోలీసులు నోరెళ్లబెట్టక తప్పలేదు.

ఎందుకంటే... అతడు ధరించిన జాకెట్‌కు భారీగా పేలుడు పదార్థాలు అమర్చి ఉండటం చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఉగ్రవాదిగా ఇంత పసిబాలుడిని తాము ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోయారు. దీంతో, కట్టుదిట్టమైన భద్రతగల కాబూల్ జైలుకు అతగాడిని తరలించి, అక్కడే విచారిస్తున్నారు.

ఇంతకూ... పసితనం ఛాయలు ఇంకా వీడని ఆ చిన్నారి పేరు అబ్దుల్లా. పాకిస్థాన్‌లోని పెషావర్‌కు చెందిన ఇతడు.. ఆడుతూ, పాడుతూ, పాఠాలు నేర్చుకుంటూ బాల్యాన్ని ఆస్వాదించాల్సిన ప్రాయంలో ఉగ్రవాదిగా మారిపోయాడు. ఏకంగా ఆత్మాహుతి దాడికి సిద్ధపడ్డాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు పట్టుబడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

కాబూల్ జైలులో ఉన్న అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన ఐటీవీ న్యూస్ ఛానల్ అంతర్జాతీయ సంపాదకుడు బిల్ నీలే.. "అమాయకత్వం ఉట్టిపడుతున్న ఆ బాలుడు ఎదురవడంతో నివ్వెరపోయానని" వ్యాఖ్యానించాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా అమాయకంగా అనిపించాడని ఆయన చెప్పారు.

అబ్దూల్లాతో మాట్లాడిన అనంతరం నీలే మాట్లాడుతూ... ఆ అబ్బాయి చదువుకునే బడిలో పగలంతా ఖురాను పఠనం, సాయంత్రం ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ఇచ్చేవారట. అబ్దుల్లా పదేళ్ల తమ్ముడు అమీన్ కూడా అదే బడిలో చదువుకుంటున్నాడని చెప్పినట్లు నీలే తెలిపారు.

" ఆత్మాహుతి దాడికి దిగితే ముక్కలు ముక్కలై చనిపోతానన్న సంగతి తనకు తెలుసుననీ.. ఆత్మహత్యకు, త్యాగానికీ తేడా కూడా తెలుసనీ, తమ ఇళ్లపై దాడులు చేసి, తమ వారిని చంపకుండా ఉండేందుకు ముస్లిమేతరులను చంపాలనుకుంటున్నానని" అబ్దుల్లా తనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు నీలే వివరించారు.

ఇదిలా ఉంటే... మతవెర్రితో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, జిహాద్ పేరుతో హత్యాకాండను కొనసాగిస్తున్న ఉగ్రవాదుల ఆగడాలకు, నేరాలకు అంతూ, పొంతూ లేకుండా పోతోంది. ఇప్పటిదాకా జిహాద్ పేరుతో ఆత్మాహుతికి యువతను మాత్రమే పురికొల్పిన అది, ఇప్పుడు పసిపిల్లల జీవితాలతో సైతం ఆడుకుంటోంది. ఇప్పటికైనా ప్రపంచదేశాలన్నీ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోయినట్లయితే... మరెన్నో దారుణాలను చవిచూడాల్సి వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

Show comments