Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడెటీ(కడుపులో మంట) ఎందుకు వస్తుంది...? నివారణ ఎలా?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2013 (21:47 IST)
WD
ఎసిడిటీ(కడుపులో మంట) వల్ల జీర్ణాశయంలో ఒకలాంటి మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.

అసలు అసిడిటీకి కారణాలు ఏంటి?
* సరిగా నిద్ర లేకపోవడం
* ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
* తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం
* ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం...
* శరీరానికి తగిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. లేదా తీసుకునే ఆహారం ఎక్కువగా తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా ఉండదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది.
* సమయానికి భోజనం చేయకపోవడం

ఎసిడిటీని అదుపు చేసేందుకు చిట్కాలు :
ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతి రోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

* మీరు తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

* పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు... ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి.

* తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది.
* ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి.
* భోజనం తీసుకున్న వెంటనే నిద్రకుపక్రమించకండి.
* మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి.

అసిడిటీని నిరోధించేందుకు చిట్కాలు :
* అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను ఉదయం రెండు ఆకులను నమిలి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
* బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు సార్లు తీసుకుంటుండాలి.
* పుచ్చకాయ, కీరకాయ, అరటిపండును తీసుకుంటే సమస్య తగ్గుతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments