కంటిచూపు, కండరాల దృఢత్వానికి ములగ

Webdunia
సోమవారం, 21 జనవరి 2013 (21:55 IST)
FILE
ములగ ఆకుల్లోనూ, కాడల్లోనూ, క్యాల్షియం, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలకు బలం కలిగిస్తుంది. నేత్రవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకులను దంచి రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనే, లేక చక్కెర కలిపి రోజూ సేవిస్తే కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు అమోఘంగా ఉంటుంది. చర్మరోగాలు రాకుండా నివారితమవుతాయి. దీని ఆకుల్ని పప్పులో కలిపి ఉడికించి తింటారు. కాడల్ని సాంబారులో వేస్తారు.

ఈ కాడల్లోని విత్తులు తినడం వల్ల కడుపులోని క్రిములు నశిస్తాయి. ఈ గింజల్ని ఎండించి, చూర్ణంగా తయారుచేసి, సస్యంలాగ పీలిస్తే, దీర్ఘకాలపు శిరశ్శూలలు దూరమౌతాయి. ఒక చెంచా మునగ ఆకుల రసంలో ఒక చెంచా ఉల్లిపాయరసం కలిపి, రెండు పూటలా బహిష్టు సమయంలో తాగితే స్త్రీలలో వచ్చే బహిష్టు కడుపునొప్పి తగ్గుతుంది.

ఆకులముద్దను నువ్వుల నూనెతో కలిపి, పట్టు వేస్తే వాపులు, సెగ్గడ్డలు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు వేళ్లను దంచి, రసం తీసి ఒక చెంచా మోతాదులో పాలతో రోజూ రెండు పూటలా తాగితే మూత్ర పిండంలో రాళ్లు కరిగిపోతాయి. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్లు కూడా తగ్గుతాయన్న పరిశీలన కూడా ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య రామ మందిరానికి రూ. 200 కోట్ల వజ్రఖచిత బంగారు విగ్రహం

ప్రేమకు నో చెప్పిందని.. రోడ్డుపైనే లైంగిక వేధింపులు-బట్టలు చింపేందుకు యత్నం (video)

విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక

ఉన్నావ్ బాధితురాలి పట్ల ఇంత దారుణమా? రాహుల్ మండిపాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి

హీరో శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

శివాజీ గారూ మీ సపోర్టు నాకు అక్కర్లేదు : నటి అనసూయ

రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ రేజర్- ఇంటెన్స్ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

సుమతీ శతకం చిత్ర టీజర్ లాంఛ్ చేసిన ఏపీ చీఫ్ విప్- 2026 ఫిబ్రవరి 6న విడుదల

Show comments