Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లులతో క్షయ వ్యాధి... దూరంగా ఉండండి జాగ్రత్త....

Webdunia
శనివారం, 29 మార్చి 2014 (14:42 IST)
FILE
చాలామందికి ఇంట్లో పిల్లులను పెంచుకునే అలవాటు ఉంటుంది. కొంతమందైతే ఆ పిల్లులను పక్కలో వేసుకుని నిద్ర కూడా పోతుంటారు. మరికొందరు కుక్కలను పెంచుకుని వాటిని పక్కలో వేసుకుని నిద్రపోతుంటారు. ఇలాంటి పెంపుడు జంతువులు వల్ల క్షయ వ్యాధి సోకే ప్రమాదం ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇటీవల పిల్లులను పెంచే ఓ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఈ పిల్లుల ద్వారా టీబీ వ్యాధి సోకినట్లు వైద్యులు కనుగొన్నారు. న్యూబురీ, బెర్క్ షైర్ లో ఇద్దరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. ఈ వ్యాధి పేరు బొవిన్ టీబీ. ఇలా పిల్లి నుంచి వ్యాధి మనిషికి సోకడం ఇదే తొలిసారనీ, కనుక ఇకపై పిల్లులను పెంచవద్దని వారు చెపుతున్నారు.

అసలు ఇలాంటి వ్యాధులు వస్తాయని తాము గతకొంత కాలంగా చెపుతున్నప్పటికీ పెడచెవిన పెట్టారనీ, అందువల్ల ఇప్పుడిది ప్రబలిందంటున్నారు. ఇది కనుక అశ్రద్ధ చేస్తే ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకని ఇప్పుడు బ్రిటన్లో ఇలాంటి రోగ లక్షణాలున్న పశువులేమైనా ఉంటే వాటిని అంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments