Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్క్ చాక్లెట్‌లతో గుండె సమస్యలకు చెక్..!!

Webdunia
చిన్న పెద్ద అంటూ వయో బేధం లేకుండా అందరినీ నోరూరించేవి చాక్లెట్లు. అయితే చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని, తింటే దంతాలు పాడవుతాయని చాలా మంది హెచ్చరిస్తుంటారు. ఇక నుంచి అలా అనే వాళ్లు మరొక్క సారి ఆలోచించుకోవాలేమో..!! ఎందుకంటే.. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

డార్క్ చాక్లెట్లు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్‌లోని హల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు డార్క్ చాక్లెట్‌లపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. దేహంలో ప్రమాదకర స్థాయికి పెరిగిన మధుమేహాన్ని తగ్గించటానికి డార్క్ చాక్లెట్లు చక్కటి ఔషధంలా ఉపయోగపడతాయని వారు తెలిపారు.

చాక్లెట్లలో పాలీఫినోల్ అనే పదార్థం అధిక స్థాయిలో అది కోకావా సాలిడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండే మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్థులకు తరచూ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. గత పరిశోధనలు కూడా కొలెస్ట్రాల్‌‌ గుండె సంబంధిత సమస్యను తగ్గిస్తుందని రుజువు చేశాయి.

ఈ తాజా పరిశోధనలో కోకావా విత్తనాలలో ఉన్న రసాయనాలు కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా టైప్-2 మధుమేహం కలిగిన 12 మంది వాలంటీర్లకు 16 వారాల పాటూ పాలీఫినోల్స్ అధికంగా ఉన్న చాక్లెట్ బార్లను ఇచ్చి పరీక్షించారు. అనంతరం వారి కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించి చూడాగా.. అది గణనీయంగా తగ్గింది.

" దీని అర్థం హృదయ సమస్యను తగ్గిస్తుంది" అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ స్టీవ్ అట్కిన్ అన్నారు. అధిక కొకావా ఉండే చాక్లెట్లు టైప్-2 డయాబెటిక్ వారికి కావలసిన డైట్‌ను అందించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఆయన అన్నారు. అయితే బ్రిటన్‌లోని కొందరు మధుమేహ నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ చాక్లెట్లలో అధిక స్థాయిలో కొకావాతో పాటు అంతే అధిక స్థాయిలో ఫ్యాట్ (కొవ్వు), షుగర్ (పంచదార)లు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మేలు కన్నా ఎక్కువ కీడునే కలిగిస్తాయనేది విమర్శకుల వాదన. బ్రిటన్‌లో దొరికే ప్రముఖ బ్రాండెడ్ చాక్లెట్‌ బార్‌లలో 200 కేలరీలు, 16 గ్రాముల వరకూ కొవ్వు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీర మంతా కొవ్వు పేరుకుపోతుందని వారు వాదిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments