Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం ఎప్పుడు వస్తుంది...?

పుత్తా యర్రం రెడ్డి
బుధవారం, 16 జులై 2008 (16:52 IST)
ఆందోళన.. ఆతృత...
  కొత్తగా పెళ్ళయిన వారు మొదలుకుని గర్భాదారణ కోసం ఎదురు చూసే ప్రతి వారిని తొలిచే ప్రశ్న.. గర్భం ఎప్పుడు వస్తుంది? వీరిలో గర్భం వస్తుందేమోనని ఆందోళన చెందేవారు కొందరైతే.... గర్భం కోసం వేయికళ్ళతో ఎదురు చూసే వారు మరికొందరు.      
అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి ఇది భయం కలిగిస్తుంది. పిల్లులు లేని వారికి ఆతృత పుట్టిస్తుంది. ఇంతమందిలో ఇన్ని రకాల భావనలను కలిగించే ఈ గర్భదారణ కథా కమామిషూ ఏమిటి....? సాధారణంగా గర్భదారణ అనేది మాతృత్వానికి చిహ్నం. స్త్రీ, పురుషుల శారీరక కలయికతో గర్భదారణ జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మరి.. స్త్రీ, పురుషులు కలిసిన వెంటనే గర్భం వచ్చేస్తుందా? అనేది కొందరి ప్రశ్న...

గర్భం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కలవాలి? ఇది ఇంకొందరి ప్రశ్న...! వీటన్నింటికి ఒక్కటే సమాధానం గర్భదారణ గురించి తెలుసుకోవడమే. సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ.
మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళలలో వీడుదలయ్యే అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భదారణ అని అంటారు. ఈ సమయంలో తప్ప మరెపుడు గర్భదారణ కాదా? అని ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కొందరిలో ముందుగా గర్భదారణ జరిగే అవకాశం కూడా ఉంది. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలలో 8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనిని ముందస్తు గర్భదారణ అంటారు.

గర్భం ఎన్నాళ్ళుంటుంది ?
సాధారణంగా గర్భదారణ సమయం నుంచి ప్రసవించే వరకూ 40 వారాల (9నెలల 10 రోజలు) కాలపరిమితిలో మహిళను గర్భవతి అంటారు. ఈ గర్భదశను మూడు దశలుగా విభజిస్తారు. మొదటి 12 వారాలను ఒకటోదశగానూ, 13-27 వారాలను రెండో దశగానూ, 28-40 వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు.

పరీక్షలు చేయించుకోవాలా...?
గర్భనిర్ధారణ అయిన తరువాత పరీక్షలు చేయించుకోవడం మంచిదే. రక్తహీనత, మూత్రపిండాలలో ఏవైనా లోపాలుంటే ఆ ప్రభావం పిండంపై పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో గర్భస్రావం కూడా జరగవచ్చు. కాబట్టి రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు తీసుకోవాలి. గర్భసంరక్షణకు వైద్యులను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే