Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగుల ఆమ్లెట్ ఎలా వేస్తారు?

Webdunia
మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (17:16 IST)
File
FILE
సాధారణంగా కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటారు. కానీ మష్రూం (పుట్టగొడుగులు)తో ఆమ్లెట్ వేసుకోవడం చాలా మందికి తెలియదు. అది ఎలా వేసుకుంటారో ఇక్కడ చూద్ధాం.

కావలసిన పదార్థాలు :
సన్నగా తరిగిన బటన్ మష్రూంలు - నాలుగు టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు - నాలుగు, తరిగిన ఉల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, మిరియాల పొడి - మూడు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము - కాస్త, ఉప్పు - తగినంత, నూనె - మూడు టేబుల్ స్పూన్లు.

తయారు చేయు విధానం :
బాణలిలో చెంచా నూనె వేస కాగాక, అందులో బటన్ మష్రూం ముక్కలను వేసి వేగాక దించేయండి. కోడిగుడ్డును పగులగొట్టి దానిని కాస్త గిలకొట్టి ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పులను వేసి కలపాలి.

తర్వాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి కాలాక, దానిపై నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన వేయించి పెట్టుకున్న బటన్ మష్రూం ముక్కలను వేసి ఉడికించాలి. రెండు వైపులా కాల్చి దించి వేడిగా సర్వ్ చేయండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments