Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్ పనీర్ ఎలా తయారు చేస్తారు?

Webdunia
బుధవారం, 26 మార్చి 2014 (18:09 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటర్
నిమ్మరసం... రెండు కాయలు
పాలకు సరిపడా పాత్ర.. ఒకటి
శుభ్రమైన తెల్లటి వస్త్రం.. ఒకటి

మిల్క్ పనీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే... పెద్ద పాత్రలో పాలను పోసి అరగంట సేపు మరిగించిన తర్వాత నిమ్మరసం వేయాలి. అలా చేస్తే పాలు విరిగిపోతాయి (ఒక లీటరు పాలకు రెండు నిమ్మకాయల రసం వేయాల్సి ఉంటుంది). పాలు విరిగిన తరువాత నీటిని ఒంపేసి మళ్లీ స్టవ్‌పై పెట్టి మరింత నిమ్మరసం వేసి మరిగించాలి. అలా నీరు మొత్తం పోయేదాకా అడుగంటకుండా జాగ్రత్తపడుతూ వేడిచేయాలి.

చివరగా పాల మిశ్రమాన్ని క్లాత్‌లో కట్టి నీరు పోయేటట్లుగా చేయాలి. ఆ తరువాత అది గట్టిగా తయారవుతుంది. దీన్ని రౌండ్ బాల్స్‌లాగా, చతురస్త్రాకారంగా, లేదా మనకు కావాల్సిన రీతిలో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పనీర్‌ను వండేటప్పుడు చిదమాల్సిన, తురమాల్సిన పని ఉండదు.

అయితే.. టిక్కాలు, స్టిక్స్ లాంటివి చేసేటప్పుడైతే... వాటి ఆకారంలో వచ్చేలాగా పనీర్‌ను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత టైం లేకపోతే మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ పనీర్ వాడుకోవచ్చు. అయితే రెడీమేడ్ పనీర్ ప్యాక్ ఓపెన్ చేసిన తరువాత వారం రోజుల్లోపుగానే వాడేయాల్సి ఉంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments