Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తివంకాయ మ్యాంగో కర్రీ ఎలా చేయాలి?

Webdunia
FILE
వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే మామిడిలో అధికంగా టార్‌టారిక్‌ యాసిడ్‌, సిట్రిక్‌ యాసిడ్‌ జాడలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మన శరీరంలో క్షార నిల్వల నిర్వహణలో తోడ్పడతాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. శరీరానికి ఎంతో మేలు చేసే మామిడి, వంకాయలతో కూర చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా..


కావలసిన పదార్థాలు :
వంకాయలు - పావుకేజీ
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమీర - 1 కట్ట.
పచ్చి మామిడి - 1.
పచ్చిమిర్చి - 30 గ్రాములు.
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2 టీ స్పూను.
ధనియాలు - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
వెలుల్లి - 10 రేకులు.
కరివేపాకు - 2 రెమ్మలు.
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు

తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి.

పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడి వేసి కలపాలి. కొత్తిమీర, కరివేపాకు తరుగుతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా అన్నానికి సర్వ్ చేయాలి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments