Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ స్పెషల్ "మొఘలాయ్ రోజ్ షర్బత్"

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (17:15 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
రోజ్ సిరప్.. 3 టీ స్పూన్లు
మీగడతో ఉండే చిక్కటి పాలు.. 3 కప్పులు
మలై బర్ఫీలు.. రెండు
చక్కెర.. అర కప్పు
కుంకుమపువ్వు.. కొద్దిగా
యాలకుల పొడి.. అర టీ.
బాదంపప్పులు.. పది
పిస్తా పప్పులు.. పది


తయారీ విధానం :
ఒక పాన్‌లో పాలను పోసి వేడి చేయాలి. అందులో చక్కెరను కలిపి అది కరిగేదాకా పాలను వేడి చేసి కిందికి దించి, పక్కన ఉంచుకోవాలి. అందులో కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేసి, కలియబెట్టి బాగా చల్లబడేదాకా పక్కనుంచాలి. చల్లారిన తరువా ఈ మిశ్రమంలో రోజ్ సిరప్ కూడా వేసి బాగా కలియబెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఇప్పుడు సర్వింగ్ గ్లాసులను తీసుకుని వాటిలో మలాయ్ బర్ఫీలను చితగ్గొట్టి కొద్ది కొద్దిగా వేసి.. ఫ్రిజ్‌లోంచి తీసిన పాల మిశ్రమాన్ని పోయాలి. పైన బాదం, వేయించిన పిస్తా పప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన మొఘలాయ్ రోజ్ షర్బత్ తయార్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments