Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్‌నట్స్ బనానా కేక్ ఎలా చేయాలి?

Webdunia
వాల్‌నట్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఒత్తిడిని, నిద్రలేమిని దూరం చేసుకోవాలంటే వాల్ నట్స్‌ పౌడర్‌ను పాలలో కలుపుకుని తాగితే సరిపోతుంది. ఊబకాయాన్ని దూరం చేసే ఈ వాల్‌నట్స్‌ను బనానాతో కలిసి కేక్‌‌లా తయారు చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. వాల్‌నట్స్ బనానా కేక్ ఎలా చేయాలో ట్రై చేద్దామా..?

కావలసిన పదార్థాలు :

మైదా పిండి - అరకేజీ
బనానా - ఐదు
బేకింగ్ పౌడర్ - అర స్పూన్
వాల్‌నట్స్ - ఒక కప్పు
షుగర్ పౌడర్ - అర కప్పు
బ్రౌన్ షుగర్ - ఒక టేబుల్ స్పూన్
పాలు - ఒక కప్పు
వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూన్
ఏలకుల పొడి - అర టీ స్పూన్
బటర్ - ఒక కప్పు
నూనె - ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం :
ముందుగా మైదాపిండితో బేకింగ్ పౌడర్, సోడా పిండి చేర్చి మూడు సార్లు బాగా జల్లించుకోవాలి. వెన్న, బ్రౌన్ షుగర్, షుగర్ పొడి ఒకవైపే బాగా గిలకొట్టాలి. ఈ గిలకొట్టిన మిశ్రమంలో జల్లించిన మైదా పిండిని కొంచెం కొంచెంగా చేర్చుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయాక అందులో అరటి పండును వేయాలి.

తర్వాత నూనె, పాలు, ఎసెన్స్‌, ఏలకుల పొడి, వాల్ నట్స్ కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని బటర్ రాసిన ట్రేలోకి తీసుకుని బేక్ చేయాలి. తర్వాత వాల్ నట్స్‌‌తో అలంకరించుకుని పిల్లలకు ఈవెనింగ్ స్నాక్స్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments