Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తున్నారా? కానీ ప్రేమను వ్యక్తపరచాలో తెలియట్లేదా? ఇందుకు చైనాలో కొత్త కోర్సుందట!

ప్రేమ మధురానుభూతి. ప్రేమకున్న మాధుర్యం ప్రత్యేకం. ప్రేమ పుట్టిందంటే.. రెక్కలు లేని పక్షిలా విహరించాల్సిందే. అయితే ప్రేమ పుట్టడం ఓకే కానీ.. ప్రేమను ప్రేయసిలేదా ప్రియుడి ముందు ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక

Webdunia
సోమవారం, 18 జులై 2016 (12:21 IST)
ప్రేమ మధురానుభూతి. ప్రేమకున్న మాధుర్యం ప్రత్యేకం. ప్రేమ పుట్టిందంటే.. రెక్కలు లేని పక్షిలా విహరించాల్సిందే. అయితే ప్రేమ పుట్టడం ఓకే కానీ.. ప్రేమను ప్రేయసిలేదా ప్రియుడి ముందు ఎలా వ్యక్తపరచాలో అర్థం కాకుండా చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారికి లవ్ గురూలు సలహాలు ఇస్తుంటారు. అయితే చైనాలోని ఓ వర్శిటీలో మాత్రం ప్రేమపై ప్రత్యేక కోర్సునే ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. టియాంజిన్‌ యూనివర్సిటీ యాజమాన్యం చైనా యువతీ యువకుల కోసం ప్రేమపై కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సును అదే యూనివర్సిటీలోని స్టూడెంట్‌ సోషల్‌ క్లబ్‌ సహ వ్యవస్థాపకుడైన 23ఏళ్ల వాంగ్‌ రూ ప్రవేశపెట్టాడు. ఇందులో ప్రేమకు సంబంధించి పలు అంశాలను బోధిస్తారు. ప్రేమిస్తే ఎలా ప్రవర్తించాలి? ఎలా వ్యక్తపరచాలి? లవర్స్‌ను ఎలా ఆకట్టుకోవాలి. ఒకవేళ ప్రేమను నిరాకరిస్తే ఏం చేయాలి అనే దానిపై శిక్షణ ఇస్తారు.
 
ఈ కోర్సు ఎందుకంటే..?
చైనాలో ఇన్నాళ్లుగా కొనసాగిన ఏక సంతానం పాలసీ వల్ల కుటుంబంలో జన్మించిన యువతియువకులు వారికి తోడుగా ఎవరు లేకపోవడంతో సమాజంలో తోటి వయసున్న యువతతో కలివిడిగా ఉండలేకపోతున్నారట. యువత మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయట. అంతేగాకుండా ఎవరితోనైనా ప్రేమలో పడితే వారి ముందు ప్రేమను వ్యక్తపరిచేందుకు తెగ ఇబ్బందిపడిపోతున్నారట. అందుకే యువతలో ధైర్యాన్ని నింపుతూ ఈ కోర్సును ప్రారంభించారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments