ప్రియా... అన్నీ కరిగిపోతాయ్... నీ ప్రేమ మాత్రం....

Webdunia
మంగళవారం, 3 మే 2016 (21:31 IST)
ప్రియా...

 
కొవ్వొత్తి కరిగిపోతుంది
క్షణం గడిచిపోతుంది
వెలుగు చీకటవుతుంది
పున్నమి అమావాస్య అవుతుంది
 
నీటి చినుకు ఆవిరవుతుంది
కారు మేఘం మాయమవుతుంది
ఇంధ్ర ధనుస్సు ఇంద్రజాలమవుతుంది
సముద్రపు కెరటం అంతర్థానమవుతుంది
 
చెట్టు ఆకులు రాల్చుతుంది
పిట్ట కూత ఆగిపోతుంది
చేనుగట్టు చిత్తడి ముద్దగా మారిపోతుంది
పంటచేను పండిపోయి పడిపోతుంది
 
కానీ
ఈ భూమి తిరుగుతుంది
కాలం గమనిస్తూనే ఉంటుంది
మనిద్దరి ప్రేమ నిత్యం కొత్త చిగురులేస్తూ ఉంటుంది
విశ్వంలో నక్షత్రాల్లా మన ప్రేమ తళుకులు
నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి
 
నీ హృదయ సవ్వడులు
నిత్యం నా హృదయంతో పరవడి చేస్తూనే ఉంటాయి
ప్రాణాలు పోయినా... ఆత్మలుగా అహరహం
నువ్వూ నేనూ ఒకటే ప్రియా...
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి

ఆస్తి కోసం మత్తు బిళ్ళలు కలిపిన బిర్యానీ భర్తకు వడ్డించి హత్య

అక్రమం సంబంధం ... వివాహితను హత్య చేసిన వ్యక్తి

అండర్-15 యువతకు సోషల్ మీడియో వినియోగంపై నిషేధం.. ఎక్కడ?

ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 20మంది సేఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments