Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతిండియాపై కన్నేసిన రాహుల్.. వాయినాడ్ నుంచి పోటీ

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (11:58 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశంపై కన్నేశారు. ఉత్తరభారతంలో తమ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగా ఉందన్న విషయాన్ని ఆయన గ్రహించారు. దీంతో ఆయన దక్షిణభారతంపై కన్నేశారు. దీంతో 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కేరళ రాష్ట్రలోని వాయినాడ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో రాహుల్ ఈ దఫా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయమై క్లారిటీ వచ్చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తెలిపారు. ఈ రెండు స్థానాల నుంచి పోటీకి రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. 
 
ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వాయనాడ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎం.ఐ.షానవాజ్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గతేడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments