Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్గీరాజా గెలుపు కోసం కంప్యూటర్ బాబా పూజలు

Webdunia
మంగళవారం, 7 మే 2019 (16:55 IST)
డిగ్గీ రాజా... అలియాస్ దిగ్విజయ్ సింగ్. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితం. ఈయన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో డిగ్గీరాజా ఒకరు. ఈయన ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
 
అయితే ఇపుడు ఈ డిగ్గీ రాజా విజయాన్ని కాంక్షిస్తూ కంప్యూటర్‌ బాబాగా పేరొందిన నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి పూజలు నిర్వహించారు. వందలాది సన్యాసులతో భోపాల్‌‌లోని సైఫియా కాలేజ్‌ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామమందిరం నిర్మించలేదని, మందిర్‌ లేకుండా నరేంద్ర మోడీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్‌ బాబా మండిపడ్డారు. 
 
బీజేపీకి చెందిన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. డిగ్గీ రాజా విజయాన్ని కాంక్షిస్తూ మూడు రోజుల పాటు ఏడు వేల మంది వరకూ సాధువులు పూజలు చేశారు. దిగ్విజయ్‌ సింగ్‌కు ఓటు వేయాలని కోరుతూ వందల మంది సన్యాసులు భోపాల్‌లో ఆటపాటలతో ప్రజలను కోరతారని కంప్యూటర్‌ బాబాగా పేరొందిన నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments