Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కర స్నానం శుక్రవారం ఉ.5.54 ప్రారంభం... ప్రతి 3 నిమిషాలకు ఓ ఉచిత ఆర్టీసి బస్సు

కృష్ణా పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఆగస్టు 12వ తేదీ ఉదయం 5.54 గంటలకు ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్‌ సూచించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో ఆగస్టు 12 నుండి 23 వరకు పన్నెం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (21:36 IST)
కృష్ణా పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఆగస్టు 12వ తేదీ ఉదయం 5.54 గంటలకు ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్‌ సూచించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో ఆగస్టు 12 నుండి 23 వరకు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి విజయవాడలో తొలి స్నానం చేస్తారని దేవాదాయశాఖ వర్గాలు తెలిపాయి. 
 
శ్రీశైలంలో రాయలసీమకు చెందిన ముఖ్య పీఠాధిపతులు, శైవసంప్రదాయం పాటించే పీఠాధిపతుల తొలి స్నానంతో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో కూడా స్వామిజీలు, పీఠాధిపతులు పాల్గొంటారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం దేశావ్యాప్తంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖుల్ని సీఎం చంద్రబాబు పుష్కరాలకు ఆహ్వానించారు. 
 
వీరితో పాటు కేంద్రమంత్రులు సహాయమంత్రులు, లోక్‌సభ స్పీకర్‌, 27 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 543 లోక్‌సభ సభ్యులు, 249 మంది రాజ్యసభ సభ్యులు, దేశంలో వివిధరాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ, శాసనమండలి సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికలు అందించారు. పీఠాధిపతులు, మఠాధిపతులను దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌, కమిషనర్‌ అనురాధ, ఇతర అధికారులు ఆహ్వానం పలుకనున్నారు.
 
కాగా విజయవాడలో పుష్కర ఘాట్లకు ప్రతి 3 నిమిషాలకు ఉచిత బస్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడలో పుష్కర ఘాట్లకు ప్రతి 3 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు సర్వీసు ఉచిత సేవలందించనుంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పుష్కర పార్కింగ్ ప్రాంతాలను ఆయా ఘాట్లకు ఉచిత బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

తర్వాతి కథనం
Show comments