Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజుగారు.. ఇద్దరు భార్యలు...!!

Webdunia
FILE
సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య.. "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.

మొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి.

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.
చీమల మాట పెడచెవిన...!
 
రెండో రాణి చీమల మాటను పెడచెవిన పెట్టింది. గులాబీ చెట్ల మాట వినలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టనేలేదు.. అయితే పేదరాశి పెద్దమ్మ చెప్పిన మాట మాత్రం విన్నది. ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని పెద్దమ్మ చెప్పిన మాటతో.. పదే పదే నీటిలో మునగసాగింది...
 
 


ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చిన పెద్ద భార్య... "నాకు బోలెడన్ని వెంట్రుకలు ఉన్నాయి, మీ రెండో భార్యకు రెండే వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి ఆమెని ఇంట్లోంచి తరిమేయండని" అడిగింది. వెంటనే రాజు రెండో భార్యను తరిమేశాడు.

అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి వెళదాం పిల్లలూ..!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

తర్వాతి కథనం
Show comments