Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది...?

Webdunia
ఒక ఊర్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి పనులు చేసుకుంటూ ఉండే వీరిద్దరూ ఒకరోజు వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు. అడవిగుండా నడచివెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగుబంటి తారసపడింది.

అంతే దాన్ని చూసి బెంబేలెత్తిన రాము, సోములిద్దరూ భయంతో పరిగెడుతూ ఒక చెట్టువద్దకు చేరుకున్నారు. సోము ఆలస్యం చేయకుండా వెంటనే గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. రామూకి చెట్టెక్కడం రాకపోవడంతో సోమూని సాయం చేయమని వేడుకున్నాడు.

తాను దిగివచ్చేలోపు ఎలుగుబంటి వచ్చేస్తుందనీ, అప్పుడు ఇద్దరం దానికి బలవక తప్పదు కాబట్టి... నేను దిగిరాను నువ్వే ఏదో ఒకటి చేసేయమని రామూతో అన్నాడు సోము. అయ్యో సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే, ఈ రోజు ఆ ఎలుగుబంటికి బలవక తప్పదా..? అంటూ ఆలోచనలో పడ్డాడు రాము.
ఆపదలో ఆదుకునేవాడే...!
  "ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని" చెప్పి వెళ్లిపోయిందని అన్నాడు రాము. అప్పటికిగానీ తాను చేసిన తప్పును గుర్తించలేని సోమూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ఆపదలో ఆదుకునేవాడే నిజమైన...      


వెంటనే ఓ ఉపాయం తళుక్కున మెరిసింది. అంతే చచ్చిపోయినవాడిలా ఆ చెట్టుకింద కదలకుండా, మెదలకుండా పడిపోయాడు రాము. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. పైకి చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు.

ఏం చేయాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి ఎందుకైనా మంచిది కిందపడిన వాడు నిజంగా చనిపోయాడా లేదో? తెలుసుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని అనుకుంది. వెంటనే రామూ దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి, చనిపోయాడని నిర్ధారించుకుని చేసేదేమీలేక అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోవడం చూసిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చిన సోము... భలే ఉపాయం పన్నావు మిత్రమా..? ఎలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నామని అన్నాడు. అది సరేగానీ.. ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరకి వచ్చి ఏదో గుసగుసలాడుతూ చెప్పింది కదా...? ఏం చెప్పింది..? అని ఆరా తీశాడు సోము.

" ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని" చెప్పి వెళ్లిపోయిందని అన్నాడు రాము. అప్పటికిగానీ తాను చేసిన తప్పును గుర్తించలేని సోమూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా కానివారు అసలు స్నేహితులే కారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

Show comments