చిన్నారులు అదే పనిగా చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారా?

బంటీ నీ సోపు స్లోనా.. అంటూ పలు రకాల యాడ్స్.. చేతిని శుభ్రం చేసుకునేందుకు వచ్చేస్తున్నాయి. అయితే పిల్లలు అదే పనిగా చేతిని సోప్‌లు, లిక్విడ్స్ ద్వారా శుభ్రం చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు.. వైద్యులు.

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (11:37 IST)
బంటీ నీ సోపు స్లోనా.. అంటూ పలు రకాల యాడ్స్.. చేతిని శుభ్రం చేసుకునేందుకు వచ్చేస్తున్నాయి. అయితే పిల్లలు అదే పనిగా చేతిని సోప్‌లు, లిక్విడ్స్ ద్వారా శుభ్రం చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు.. వైద్యులు. అతిశుభ్రంతో చిన్నారులు అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని  చెప్తున్నారు. పెద్దవారి శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు సహజీవనం చేస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని సూక్ష్మజీవులు శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇలాంటి సూక్ష్మజీవులు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి కడుపులో పెరుగుతాయి. 
 
కానీ సూక్ష్మజీవులు పిల్లల శరీరంలో ప్రవేశించేందుకు వీలులేకుండా వారిచేతులను పదే పదే శుభ్రం చేస్తూంటే మంచి సూక్ష్మజీవులు.. పిల్లల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. దీని కారణంగా వారు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అందువలన పిల్లలను కొద్దిసేపు మట్టిలో ఆడుకోనివ్వాలని వారు సూచిస్తున్నారు. పిల్లలు ఆటల నుంచి వచ్చిన తరువాత తల్లులు పదే పదే వారి చేతులను సబ్బుతోనూ, లిక్విడ్‌తోనూ శుభ్రం చేస్తారు.
 
ఇలా చేయడం వలన మట్టి నుంచి లభించే మంచి సూక్ష్మజీవులను కూడా మనం పోగొట్టుకోవలసి వస్తుందని, పిల్లలు ఆడుకుని రాగానే వారి చేతులను నీటితో శుభ్రం చేస్తే సరిపోతుందని చైల్డ్ కేర్ నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్ శానిటైజర్లను వాడటం ద్వారా పిల్లల చేతులు పొడిబారుతాయని తద్వారా పగుళ్లు ఏర్పడి.. వాటి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తాయని.. ఇలాంటి శానిటైజర్లు వాడితే మాయిశ్ఛరైజర్ క్రీములు తప్పకుండా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులకు రసాయనాలతో కూడిన హ్యాండ్ వాష్‌లను ఉపయోగించి వాష్ చేయడం కంటే.. చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుందని వారు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments