Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో మధుమేహం తప్పదట!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (17:46 IST)
బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఇంగ్లండ్‌లోని పాఠశాలల్లో 10 ఏళ్లలోపు పిల్లలపై జరిపిన ఈ పరిశోధనలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలామటుకు ఉన్నాయని తేలింది. 
 
ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ద్వారా డయాబెటిస్2 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలియవచ్చింది. ఈ ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటే.. ఉదయం పూట అల్పాహారం తప్పకుండా తీసుకోవాల్సిందిగా నచ్చజెప్పాలి. ఉదయం పూట పీచు పదార్థాలు అధికంగా గల సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలను తీసుకునేలా చేయాలి. తద్వారా డయాబెటిస్‌తో పాటు ఒబిసిటీని కూడా దూరం చేసుకోవచ్చు.
 
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..?
అల్పాహారం తీసుకోకుండా మారాం చేసే పిల్లల పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో మార్పులు చేయాలి. డైట్ ప్లాన్ మార్చాలి. పిల్లలకు నచ్చే ఆహారం ఇస్తూనే... అందులో పోషక విలువలు ఉండేలా చేసుకోవాలి. లేకుంటే కంటి సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత రోగాలతో ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments