Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల సంరక్షణ ఎలా? తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకోవాలి?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (10:25 IST)
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవి ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. పిల్లలు బాగా చదవాలంటే కొన్ని సూత్రాలు తప్పకుండా పాటించాలి. పిల్లల ముందు భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడకూడదు. పక్కింటి, బంధువుల పిల్లలు బాగా చదివేస్తున్నారు.. మీరెందుకు సరిగ్గా చదువుకోరని పిల్లల్ని నిందించడం ముందుగా మానుకోవాలి. వారు చేసే ప్రతి పనిని మెచ్చుకోవాలి. తప్పు చేస్తే ఆ తప్పును వారు అర్థం చేసుకునే రీతిలో చెప్పాలి. దీంతో పిల్లలకు ఆత్మవిశ్వాసం అభివృద్ధి అవుతుంది. మీ పిల్లలూ బాగా చదువుకుంటారు. 
 
ఇంకా పిల్లలకు విద్యపై ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?
పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అతిగా టి.వీలను చూడనీయకూడదు. ఎదిగే పిల్లలపై టి.వీ. ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. రాత్రి 9 గంటల లోపుగా పిల్లలను నిద్రపోయేలా చూడాలి. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది. 
 
ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపాలి. చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి లేదా సినిమాకు వెళ్ళాలి. 3 లేదా 6 నెలలకు ఒకసారి కుటుంబమంతా కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలి. విజ్ఞానమును భోదించే విహారయాత్ర అయితే ఇంకా మంచిది. 
 
ఉదయం, రాత్రి తప్పనిసరిగా పళ్ళుశుభ్రం చేసుకునేలా అలవాటు చేయించాలి. ఇలా చేసిన వారిలో పళ్ళనొప్పులు రావు. పంటి బాధలు ఉండవు. ప్రతి దినమూ తప్పనిసరిగా మలవిసర్జన చక్కగా అవుతున్నదో లేదో గమనిస్తూ ఉండాలి. మల విసర్జన ఖచ్చితంగా ప్రతిరోజూ చక్కగా జరిగే పిల్లలు ఇతర పిల్లలకన్నా జ్ఞానవృద్ధి అధికంగా కలిగి ఉంటారు. పైగా వీరికి మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. వీరికి అనారోగ్య సమస్యలు తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments