Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు చెప్పిన మాట వినట్లేదా? సింపుల్ ఇలా చేయండి.

పిల్లలు చెప్పిన మాట వినట్లేదా? తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదా.. అయితే బాధపడకండి. పిల్లల్ని ఈజీగా నియంత్రించే మార్గాలను ఎంచుకోండి. పిల్లలపై పెద్దగా అరవడం, దూషించడం వంటివి చేస్త

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:53 IST)
పిల్లలు చెప్పిన మాట వినట్లేదా? తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదా.. అయితే బాధపడకండి. పిల్లల్ని ఈజీగా నియంత్రించే మార్గాలను ఎంచుకోండి. పిల్లలపై పెద్దగా అరవడం, దూషించడం వంటివి చేస్తే.. పిల్లల్లో కోపం ఎక్కువవుతుంది. తద్వారా తల్లిదండ్రులంటే వారికి నిర్లక్ష్య వైఖరి ఏర్పడుతుంది. అందుకే పిల్లలను పదే పదే తిట్టడం చేయకూడదు. 
 
కావీ పిల్లలు అహంకారంతో ప్రవర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే స్పందించాలంటున్నారు. చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లల ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు.. పిల్లవాడి పట్ల ఏదో తప్పు జరిగిందన్న విషయాన్ని వెంటనే గ్రహించాల్సిన అవసరముంది. మీ బిడ్డ మీతో అహంకారంతో ప్రవర్తిస్తే, మీకు వారిపై అధికారం ఉందని దగ్గరికి తీసుకోవాలి. అహంతో ఏర్పడే నష్టాలను వారికి చెప్పాలి. సమస్యేంటో అడిగి తెలుసుకోవాలి. దానికి పరిష్కారం ఏంటో కూడా చెప్పాలి.   
 
పిల్లలు తలిదండ్రుల వద్ద ఏ విషయమైనా స్వేచ్ఛగా తెలియజేసేందుకు వీలుకల్పించాలి. ఎప్పుడూ స్ట్రిట్‌గా ఉండకూడదు. సరైన సమయంలో కమ్యూనికేషన్ జరిగితే, ఎన్ని లోపాలున్నా మీ అనుబంధం చెడిపోయే ప్రమాదం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలి. వారికి నచ్చిన విషయాన్ని గ్రహించండి. చెడు విషయాలను పక్కనబెట్టే దిశగా ఏం చేయాలో ఆలోచించండని వారు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments