Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025 నాటికి పిల్లల్లో టైప్-2 డయాబెటిస్: టీవీలకే అతుక్కుపోవడం.. జంక్ ఫుడ్ తినడం..?

టెక్నాలజీ పెరగడమో ఏమో కానీ... పిల్లలు టీవీలకు, వీడియో గేమ్‌లకు అతుక్కుపోతున్నారు. టీవీలకు అతుక్కుపోవడమే గాకుండా జంక్ ఫుడ్‌కు బాగా అలవాటుపడిపోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం బరిలో పడుతు

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (15:45 IST)
టెక్నాలజీ పెరగడమో ఏమో కానీ... పిల్లలు టీవీలకు, వీడియో గేమ్‌లకు అతుక్కుపోతున్నారు. టీవీలకు అతుక్కుపోవడమే గాకుండా జంక్ ఫుడ్‌కు బాగా అలవాటుపడిపోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం బరిలో పడుతున్నారు. ప్రపంచంలో బాలల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 
 
పిల్లల్లో ఊబకాయం సమస్య అంటువ్యాధిగా మారి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు. అందుకే పిల్లల్లో ఒబిసిటీ పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు. 2025వ సంవత్సరం నాటికి 4 మిలియన్ల మంది పిల్లలు టైప్ 2 మధుమేహవ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. 
 
ప్రపంచంలో 2025వ సంవత్సరం నాటికి 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో 26.8 కోట్ల మంది అధికబరువు సమస్యతో సతమతమయ్యే అవకాశం ఉందని వాషింగ్టన్ పరిశోధకులు అంచనా వేశారు. పిల్లల జీవనశైలిలో మార్పులు చేసుకోకుంటే ఊబకాయుల సంఖ్య పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా పిల్లల్లో పెరుగుతున్న అధిక బరువు సమస్యపై అంచనాలను విడుదల చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

తర్వాతి కథనం
Show comments