Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంక్ ఫుడ్‌తో పిల్లలు లేజీగా తయారవుతారా?

Webdunia
సోమవారం, 14 జులై 2014 (16:35 IST)
మీ పిల్లలు ఫాస్ట్ ఫుడ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా. వారానికోసారి అయినా పేరెంట్స్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, తండూరి చికెన్ తీసివ్వాల్సిందేనని అల్లరి చేసేస్తున్నారా..? అయితే మీ పిల్లలు డల్‌గా తయారవుతారని న్యూట్రీషన్లు అంటున్నారు. పిల్లలు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి మందగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి శత్రువు. ఫాస్ట్ ఫుడ్‌లో ప్రిజర్వేటింగ్ ఆరోగ్యానికి హాని చేస్తుందని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. రెడీమేడ్‌గా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా పిల్లల్లో మెల్ల మెల్లగా జ్ఞాపకశక్తి తక్కువవుతుందని వారు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ కారణంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరడంతో పాటు అనవసరపు కెలోరీలు అధికమవుతున్నాయి. 
 
కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఇంకా ఫాస్ట్‌ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటైన పిల్లల్లో సోమరితనం ఆవహిస్తోంది. జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి తగ్గిపోతోంది. చిప్స్ వంటి స్నాక్స్‌ల్లో సోడియం, పొటాషియం ఎక్కువ శాతం ఉంది. ఇవి రక్తనాళాలకు చెడు చేస్తుంది. తద్వారా చేదు, పులుపు వంటివి నచ్చకుండా పోతున్నాయి. అందుచేత పిల్లలు చురుగ్గా ఉండాలంటే ఆకుకూరలు, కూరగాయలు అధికంగా ఇవ్వాలని న్యూట్రీషన్లు అంటున్నారు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments