Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో కడుపునొప్పి రాకుండా ఉండాలంటే?

Webdunia
గురువారం, 4 సెప్టెంబరు 2014 (16:52 IST)
పిల్లల్లో కడుపునొప్పి రాకుండా ఉండాలంటే? ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. ఆహారపు అలవాట్ల వలనే కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు ఏర్పడటం, నులిపురుగులు తయారవడం జరుగుతుంటాయి. 
 
కాబట్టి, పిల్లలకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడంలాంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పిల్లలకు కడుపు నొప్పి పదే పదే వస్తున్నా, రాత్రిళ్ళు వచ్చిన నొప్పి ఎక్కువ సేపు ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి.
 
కారణాలు: కలుషిత ఆహారం తీసుకోవడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, నులిపురుగులు తయారవడం, ఇన్ఫెక్షన్లు కలగడం, హెర్నియా, ట్రాన్సిల్స్ ఇన్ ఫెక్షన్స్, జాండిస్ రావడానికి ముందు, టైఫాయిడ్, మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్, అమీబియాసిస్, జియాడియాసిస్, హైపర్ ఎసిడిటి, ఐబ్యూఫ్రొఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడటం వంటివి కడుపునొప్పి రావటానికి ప్రధాన కారణాలు. 
 
1. భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. 
2. చేతులకు గోళ్ళు లేకుండా చూసుకోవాలి.
3. బాగా ఉడకబెట్టిన ఆహారంను మాత్రమే తీసుకోవాలి. 
4. టైఫాయిడ్, జాండిస్ నిరోధక వ్యాక్సిన్లను పిల్లలకు తప్పకుండా వేయించాలి.
5. 1-5సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి 6నెలలకొకసారి డివార్మింగ్ మెడిసిన్ ఇవ్వాలి. 
6. నొప్పి నివారణకు మాత్రలను వాడటం తగ్గించాలి.
7. ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మల, మూత్ర విసర్జన అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
8. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. 
9. ప్రతి రోజూ 6-8గ్లాసుల నీరు తీసుకోవాలి. 
10. వేడి వేడి ఆహారాన్ని మాత్రమే భుజించాలి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments